నాగర్ కర్నూల్ రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రభ దినపత్రిక స్టాప్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న ఎస్ శ్రీనివాస్ బాబును, ఆయన కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్ బాబు కుమారుడు ఇటీవల హైదరాబాదులో సెటిల్ ఆడుతూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించాడు. ఆంధ్రాలో ఇటీవలే అంత్యక్రియలు నిర్వహించారు.
అంత్యక్రియల అనంతరం జర్నలిస్టు బాబు కుటుంబం నాగర్ కర్నూల్‌కు వచ్చింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. శనివారం ఉదయం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు పలుస విజయ్ కుమార్, కందికొండ మోహన్, వెలుగు సత్యం, ప్రదీప్, మల్లేష్, కౌన్సిలర్ రాజు తదితరులు ఉన్నారు.