Jyotiraditya Scindia | సొంత టెలికాం టెక్నాలజీ ఉన్న టాప్-5 దేశాల్లో భారత్ ఒకటి : కేంద్రమంత్రి సింధియా
Jyotiraditya Scindia | సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్ కన్నా ముందు చైనా, ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణా కొరియా మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం కంపెనీలు విలీనవుతున్నాయన్నారు.
Jyotiraditya Scindia | సొంత టెలికాం టెక్నాలజీ కలిగిన దేశాల సరసన భారత్ చేరిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. భారత్ కన్నా ముందు చైనా, ఫిన్లాండ్, స్వీడన్, దక్షిణా కొరియా మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెలికాం కంపెనీలు విలీనవుతున్నాయన్నారు. భారత్‌లో నాలుగు కంపెనీలు ఉన్నాయన్నారు. 2014లో 90కోట్ల మంది మొబైల్ కస్టమర్స్ ఉండగా.. నేడు ఈ సంఖ్య 1.2 మిలియన్లకుపైగా పెరిగిందన్నారు. అప్పుడు 25కోట్ల మంది ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యారని.. ప్రస్తుతం 97కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. 2014లో ఆరు కోట్ల మందికి బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ఉందని.. ఆ సంఖ్య నేడు 94 కోట్లకు చేరుకుందని.. ఇది అమెరికా మొత్తం జనాభా కంటే ఎక్కువ అని తెలిపారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా లక్ష స్వదేశీ 4జీ మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోందని.. వీటిని 5జీగా మారుస్తామని మంత్రి చెప్పారు. ఈ పని జూన్ నాటికి పూర్తవుతుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన కింద జరుగుతోందన్నారు. ప్రభుత్వం డైరెక్ట్-టు-డివైస్ (DTD) ఉపగ్రహ సేవలను ప్రారంభించిందని సింధియా చెప్పారు. ఈ సాంకేతికతలో నెట్‌వర్క్‌కు కనెక్ట్ కానప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ నుంచి సందేశాలను పంపొచ్చన్నారు. అప్పుడు కనెక్టివిటీ మొబైల్ టవర్ నుంచి కాకుండా ఉపగ్రహం నుంచి నేరుగా అందుతుందన్నారు. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ భారతదేశంలో ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించడానికి దరఖాస్తు చేసుకోవడమే కాకుండా.. ఇతర అనేక కంపెనీలు సైతం ఆసక్తిని చూపించాయన్నారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ సేవల కోసం ఇప్పటికే రెండు కంపెనీలకు లైసెన్స్‌లు ఇచ్చామని సింధియా చెప్పారు. ఇందులో ఒకటి రిలయన్స్, మరొకటి భారతీ ఎయిర్‌టెల్‌కు జారీ చేసినట్లు వివరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

