బీసీలను అణచివేసే కుట్రలు
బీసీలను రాజకీయంగా అణచివేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగుసంపత్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఆ సంఘం కార్యాలయంలో అదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగుసంపత్ గౌడ్
కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 22 : బీసీలను రాజకీయంగా అణచివేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగుసంపత్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఆ సంఘం కార్యాలయంలో అదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ సబ్ప్లాన్కు నిధులు కేటాయిస్తామని, విద్య, ఉద్యోగ, రాజకీయంగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే బీసీలను విస్మరించించారని మండిపడ్డారు.
రెండేండ్లయినా ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని గ్రామగ్రామానా ప్రచారం చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

