బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బీసీ రిజర్వేషన్ల పేరిట బీసీలకు అన్యాయం చేయడంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడని బీఆర్ఎస్, బీసీ సంఘం నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు.