TDP : బడుగు, బలహీన వర్గాలకు ఎన్టీఆర్ సముచిత స్థానం : సైదేశ్వరరావు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్ దేనని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు.
కోదాడ, మార్చి 29 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్ దేనని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు అన్నారు. శనివారం టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం క్రాస్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా బస్టాండ్ వద్దకు చేరుకుని పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఎన్టీఆర్ పార్టీలో పెద్దపీట వేశారని, తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్నాయని, పేద ప్రజల దేవుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ఓరుగంటి ప్రభాకర్, రాష్ట్ర మాజీ కార్యదర్శి భయ్యా నారాయణ, కోడె వాసు,,గుల్లపల్లి సురేశ్, దొడ్డ గురవయ్య, కొల్లు నరసయ్య, కొల్లు సత్యనారాయణ, గుండు నాగేశ్వరరావు, చాపల శ్రీనివాసరావు, పిట్టల శోభన్బాబు, కొల్లు నరసయ్య, గుండు నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

