Kanpur Test : టీ20 తరహా విధ్వంసంతో కాన్పూర్ టెస్టును గెలుచుకున్న టీమిండియా రికార్డులు బద్ధలు కొట్టింది. వర్షం కారణంగా రెండు రోజులు ఆట సాగని నేపథ్యంలో విజయమే లక్ష్యంగా భారత ఆటగాళ్లు చెలరేగిన తీరు అమోఘం. నాలుగో రోజు బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశాడు దూకుడే మంత్రగా ఆడాలని సహచరులకు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అల్టిమేటం జారీ చేశాడు. ఒక్క బంతిని వదలొద్దని.. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడాలని సూచించడంతో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు రోజుల్లోనే జయభేరి మోగించడం కోసం తాము అనుసరించిన వ్యూహాన్ని హిట్‌మ్యాన్ మీడియా సమావేశంలో వెల్లడించాడు.
‘వర్షం కారణంగా రెండున్నర రోజులు కోల్పోయాం. అందుకని నాలుగో రోజు బంగ్లాదేశ్‌ను త్వరగా ఆలౌట్ చేయాలని.. ఆ తర్వాత బ్యాటుతో వేగంగా వీలైనన్ని పరుగులు చేయాలని భావించాం. అందుకనే ధనాధన్ ఆడాలని నిర్ణయించుకున్నాం. ఆ తరహాలో ఆడే క్రమంలో స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయ్యే అవకాశముంది.
HITMAN ✖️ SPIDEY 🔥
📷:- Rishabh Pant/ Instagram #RohitSharma #RishabhPant #INDvsBAN #Tests #Insidesport #CricketTwitter pic.twitter.com/bhkdDvfNou
— InsideSport (@InsideSportIND) October 1, 2024
అయినా సరే రిస్క్ తీసుకోవడానికి సిద్దమయ్యాం. ధాటిగా ఆడే సమయంలో 100 లేదా 120కే ఆలౌట్ అయినా పర్వాలేదనుకున్నాం’ అని రోహిత్ తెలిపాడు. అంతేకాదు పేసర్ ఆకాశ్ దీప్‌పై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. ఆకాశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్లో బాగా ఆడాడు. అతడి నైపుణ్యం అమోఘం. సుదీర్ఘ స్పెల్స్ వేయగలడు అని రోహిత్ అన్నాడు.
This is India’s new test team which has been created with great enthusiasm by Captain Rohit Sharma 🐐 pic.twitter.com/vnbgUFJoSG
— Aditya (@iamAdi45_) September 30, 2024
నాలుగోరోజు కెప్టెన్ రోహిత్, కోచ్ గౌతం గంభీర్ గేమ్ ప్లాన్‌ను కుర్రాడు యశస్వీ జైస్వాల్(72), శుభ్‌మన్ గిల్(39).. కేఎల్ రాహుల్(68)లు పక్కాగా అమలు చేశారు. తుఫాన్ ఇన్నింగ్స్‌తో బంగ్లా బౌలర్లను భయపెట్టారు. దాంతో, 3 ఓవర్లకు స్కోర్ 50 దాటింది. యశస్వీ, గిల్ జోరుతో 10 ఓవర్లకు స్కోర్ 100కు చేరింది.
Great performance by team India as they completed the series win 2-0. All our bowlers, @ashwinravi99, @imjadeja, @Jaspritbumrah93 have put on an incredible show in restricting the Bangladesh batters. The intent and aggression of our batters from the word go defined the test… pic.twitter.com/V0mJIXtkYo
— Jay Shah (@JayShah) October 1, 2024
ఆ తర్వాత రాహుల్, విరాట్ కోహ్లీ(47)లు తమ సహజ శైలికి భిన్నంగా చెలరేగారు. భారీ షాట్లతో విరుచుకుపడిన వీళ్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టగా.. 285-9 వద్ద హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత భారత పేసర్ బుమ్రా(317), స్పిన్ ద్వయం అశ్విన్(350), జడేజా(334)లు బంగ్లాను పడగొట్టారు. అనంతరం 95 పరుగుల లక్ష్య ఛేదనలో యశస్వీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దాంతో, 7 వికెట్ల తేడాతో జట్టుకు చిరస్మరణీయ విజయం కట్టబెట్టారు. దాంతో, అనుకున్నట్టే టీమిండియా 7 వికెట్లతో గెలుపొంది.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది.