అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కొత్త మద్యం పాలసీని (New liquor policy ) అమలును ప్రారంభించింది. ఇందులో భాగంగా మద్యం షాపుల(Liquor Policy) ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణను మంగళవారం నుంచే ప్రారంభించింది. ఈనెల 11 వరకు నోటిఫికేషన్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను 11న లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు. 12 కొత్త మద్యం షాపులు ప్రారంభం అవుతాయని వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 3, 396 షాపులుండగా వాటికి సోమవారి అర్దరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో షాపును రూ.2లక్షలు చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా ఐదు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం దుకాణాలు ఏర్పాటు చేసే ప్రాంత జనాభాను బట్టి మొత్తం నాలుగు శ్లాబుల్లో లైసెన్సు రుసుములు ఖరారు చేశారు.
తొలి ఏడాది పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ. 85 లక్షలుగా లైసెన్సు రుసుమును నిర్ణయించింది. రెండో ఏడాది ఈ రుసుములపై పదిశాతం చొప్పున పెంచి వసూలు చేయడం జరుగుతుదన వివరించారు. ఏటా ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలని వెల్లడించారు.
రిటైల్ వ్యాపారం చేసే లైసెన్సుదారుకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుందని తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం , రాజమహేంద్రవరం , కాకినాడ, గుంటూరు.నెల్లూరు, కర్నూలు, కడప ,అనంతపురాల్లో అదనంగా 12 ప్రీమియం స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుందన్నారు. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటి. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తామని తెలిపారు .