Ashwin : స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే చాలు చెలరేగిపోయే రవి చంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) మరసారి తన మ్యాజిక్ చూపించాడు. చెపాక్ స్టేడియంలో సెంచరీతో పాటు ఆరు వికెట్లతో చరిత్ర సృష్టించిన అతడు మరో ఘనత సాధించాడు. రెండు టెస్టుల సిరీస్‌లో బ్యాటుతో, బంతితో చెలరేగిన అశ్విన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(Player Of The Series) అవార్డు అందుకున్నాడు.
టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ ఆఫ్ స్పిన్నర్ 11వ సారి ఈ అవార్డు ఎగరేసుకుపోయాడు. తద్వారా స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralidharan) రికార్డును అశూ సమం చేశాడు. ప్రపంచంలోని మేటి స్పిన్నర్ అయిన మురళీధరన్ 11 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే.. అతడి రికార్డుకు అశ్విన్ ఎసరు పెట్టాడు.
🚨 HISTORY BY RAVI ASHWIN…!!! 🚨
– Ravi Ashwin equals Muttiah Muralitharan for most Player Of The Series awards in Test cricket. 🇮🇳 pic.twitter.com/8iPMt91Xrq
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్ట్ సిరీస్ విజయంలో భాగమైన అశూ సైతం 11వ సారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక పర్యాయాలు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వాళ్లలో దిగ్గజ ఆల్‌రౌండర్లు, పేసర్లు ఉన్నారు. ఇంతకూ వాళ్లు ఎవరంటే..?
1. ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక) – 11 సార్లు.
2. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 11 సార్లు.
3. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 9 పర్యాయాలు.
4. రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) – 8 సార్లు.
5. ఇమ్రాన్ ఖాన్ (పాకిస్థాన్) – 8 సార్లు.
6. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 8 పర్యాయాలు.
1⃣1⃣4⃣ runs with the bat
1⃣1⃣ wickets with the ballR Ashwin becomes the Player of the Series for his terrific all-round display 🫡
Scorecard – https://t.co/JBVX2gyyPf#TeamIndia | #INDvBAN | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/ygNcY3QhXd
— BCCI (@BCCI) October 1, 2024
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అశ్విన్ విశేషంగా రాణించాడు. బ్యాటుతో బాదేసి114 పరుగులు.. బంతితో తిప్పేసి 11 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. మొదట సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో మెరపు ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న అతడు టెస్టుల్లో ఏడో శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత బంతితో బంగ్లా బ్యాటర్లను డగౌట్‌కు చేర్చి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సాధించాడు. కాన్పూర్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా టాపార్డర్‌ను కూల్చిన అశ్విన్ ఇండియా చిరస్మరణీయ విజయంలో కీలకమయ్యాడు.