RTC Bus Accident | అమరావతి శివారులో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. ముందు టైర్ పగలడంతో బస్సు కందకంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
బస్సు విజయవాడ నుంచి అమరావతికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.