Neeraj Chopra : వరుసగా రెండు విశ్వ క్రీడల్లో పతకాలతో చరిత్ర సృష్టించిన బడిసె వీరుడు నీరజ్ చోప్రా (Neeraj Chopra)కు ఊహించని షాక్. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) నుంచి పారిస్ విశ్వ క్రీడల వరకూ అతడికి వెన్నంటి నిలిచిన కోచ్ క్లాస్ బార్టోనీఎట్జ్(Klaus Bartonietz) సెలవు తీసుకుంటున్నాడు. జర్మనీకి చెందిన క్లాస్ ఇక నీరజ్‌కు కోచింగ్ ఇవ్వలేనని స్పష్టం చేశాడు. 75 ఏండ్ల క్లాస్ విశ్రాంత జీవితాన్ని కుటుంబంతో గడిపేందుకు స్వదేశం వెళ్తున్నట్టు చెప్పాడు. దాంతో, నీరజ్ చోప్రా కొత్త కోచ్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నీరజ్ చోప్రాను ప్రపంచ స్థాయి అథ్లెట్ చేసిన క్లాసో 2021 తర్వాత కోచింగ్ ఇవ్వనని చెప్పేశాడట. అయితే.. భారత అథ్లెటిక్స్ సమాఖ్య బతిమాలడంతో మరో మూడేండ్లు కొనసాగేందుకు అతడు అంగీకరించాడట. ఈ విషయాన్ని మంగళవారం అథ్లెటిక్స్ సమాఖ్య చీఫ్ కోచ్ రాధాకృష్ణ నాయర్ వెల్లడించాడు.
As per reports, Neeraj Chopra has parted ways with Coach Klaus Bartonietz. The previous coach guided Chopra to two Olympic Medals and two World Championship medals.🇮🇳
Mr. Bartonietz now wants to spend time with his family and be away from sport.#Athletics #SKIndianSports pic.twitter.com/13lZa4mtNc
— Sportskeeda (@Sportskeeda) October 1, 2024
‘2021 తర్వాత నీరజ్‌కు శిక్షణ ఇచ్చేందుకు క్లాసో సిద్దంగా లేడు. అప్పుడు మేము ఆయనను బతిమిలాడాం. దాంతో, ఆయన కోచింగ్ కొనసాగించారు. కానీ, ఈసారి మాత్రం క్లాసో తన కాంట్రాక్ట్ పొడిగింపును కోరుకోవడం లేదు’ అని రాధాకృష్ణన్ తెలిపాడు. క్లాస్ బార్టోనీఎట్జ్ శిక్షణలో నీరజ్ చోప్రాను దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారాడు. డైమండ్ లీగ్స్‌లో స్వర్ణంతో మొదలైన అతడి విజయ ప్రస్థానం టోక్య ఒలింపిక్స్‌లో పసిడితో తారా స్థాయికి చేరింది. తాజాగా పారిస్‌నూ నీరజ్ రెండో స్థానంతో రజత వెలుగులు విరజిమ్మాడు.
పారిస్ ఒలింపిక్స్ ముందు స్పోర్ట్స్ హెర్నియాతో బాధ పడిన నీరజ్ నొప్పిని భరిస్తూనే బరిలోకి దిగాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు. అనంతరం సర్జరీ కోసం కొన్ని రోజుల బ్రేక్ తీసుకుంటానని నీరజ్ చెప్పాడు. కానీ, గాయం తీవ్రత ఎక్కువ లేనందున మళ్లీ ఈటెను అందుకున్నాడు.
సర్జరీ వాయిదా వేసుకొని.. లసానే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇక బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో విరిగిన చేయితోనే పోటీ పడి రెండో స్థానంలో నిలిచి ఔరా అనిపించాడు. మూడో ప్రయత్నంలో అతడు బడిసెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. అయితే.. జులియన్ వెబర్ 87.97 మీటర్ల దూరంలో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు.