తిరుమల : కలియుగ వైకుంఠమైన తిరుమల ( Tirumala ) లో అక్టోబరు (October) నెలలో విశేష పర్వదినాలు (Festival )ఇలా ఉన్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. అక్టోబరు 2న మహాలయ అమావాస్య , 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు.
4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, 8న శ్రీవారి గరుడసేవ, 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం, 11న రథోత్సవం (Rathostavam) , 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. 13న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం, 28న సర్వ ఏకాదశి, 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని రూ. 66,986 మంది దర్శించుకోగా 26,163 మంద తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల స్వామివారి హుండీకి రూ. 5.05 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.