Tecno Spark 30C 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన టెక్నో స్పార్క్ 30సీ 5జీ ఫోన్ ను వచ్చే వారం భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది. 48మెగా పిక్సెల్ సోనీ కెమెరా విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న టెక్నో స్పార్క్ 30సీ ఫోన్ 6.67 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ నెల ఎనిమిదో తేదీన టెక్నో స్పార్క్ 30సీ 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారు. ఏఐ బ్యాక్డ్ కమెరా యూనిట్ తో వస్తున్న టెక్నో స్పార్క్ 30సీ 5జీ ఫోన్లో 48-మెగా పిక్సెల్ సోనీ సెన్సర్ ఉంటుంది.
గ్లోబల్ మార్కెట్లలో టెక్నో స్పార్క్ 30, టెక్నో స్పార్క్ 30 ప్రో పోన్లతోపాటు టెక్నో స్పార్క్ 30సీ ఫోన్ కూడా ఆవిష్కరించారు. మ్యాజిక్ స్కిన్ 3.0, ఆర్బిట్ బ్లాక్, ఆర్బిట్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మద్దతుతో 6.67 అంగుళాల హెచ్డీ+ (720 x1600 పిక్సెల్స్) డిస్ ప్లేతో వస్తోంది. మీడియాటెక్ హెలియో జీ81 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 4 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
18వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది టెక్నో స్పార్క్ 30సీ ఫోన్. ఈ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కెమెరా ఉంటాయి.