Dhawal Kulkarni | ‘ముంబై యోధుడు’.. రంజీ హీరో కెరీర్‌పై రోహిత్ ప్రశంసలు
Dhawal Kulkarni : భారత ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణి(Dhawal Kulkarni) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ముంబైని రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన మాజీ సహచరుడైన...
Dhawal Kulkarni : భారత ఫాస్ట్ బౌలర్ ధవల్ కులకర్ణి(Dhawal Kulkarni) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ముంబైని రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన అతడు ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన మాజీ సహచరుడైన కులకర్ణిపై ప్రశంసలు గుప్పించాడు. ఈ స్టార్ పేసర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ముంబై యోధుడు. నీ కెరీర్ అద్భుతంగా సాగినందుకు అభినందనలు’ అని హిట్‌మ్యాన్ కామెంట్ చేశాడు. రోహిత్, కులకర్ణిలు గతంలో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు.
వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో పేసర్ కులకర్ణి సూపర్ స్పెల్‌తో విదర్భను వణికించాడు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన అతడు ఆరు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌ను ఆఖరి వికెట్‌గా వెనక్కి పంపాడు. దాంతో, ముంబై 8 ఏండ్ల తర్వాత టైటిల్ విజేతగా నిలిచింది. మొత్తంగా 42వ టైటిల్ కావడం విశేషం.
𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐌𝐮𝐦𝐛𝐚𝐢!
Dhawal Kulkarni takes the final wicket as they beat Vidarbha by 169 runs in the @IDFCFIRSTBank #RanjiTrophy #Final in Mumbai
Brilliant performance from the Ajinkya Rahane-led side 👌
Scorecard ▶️ https://t.co/k7JhkLhgT5 pic.twitter.com/Iu458SZF2F
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
కులకర్ణి 2008లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. సంచలన బౌలింగ్‌తో ముంబై విజయాల్లో భాగమయ్యాడు. అంతేకాదు ముంబై ఫాస్ట్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహించిన అతడు 15 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తంగా ఈ స్పీడ్‌స్టర్ 95 మ్యాచుల్లో 281 వికెట్లు పడగొట్టాడు.
𝐂. 𝐇. 𝐀. 𝐌. 𝐏. 𝐈. 𝐎. 𝐍. 𝐒! 🏆
Congratulations and a round of applause for the 4⃣2⃣-time #RanjiTrophy winners – Mumbai 👏 👏#Final | #MUMvVID | @MumbaiCricAssoc | @IDFCFIRSTBank pic.twitter.com/U5AuVayGzt
— BCCI Domestic (@BCCIdomestic) March 14, 2024
ఇవి కూడా చదవండి
- Viral Gulab Jamun Pizza | గులాబ్ జామూన్ పిజా వీడియోపై విరుచుకుపడ్డ నెటిజన్లు
- Viral Video | చికెన్‌ను ఇలా కూడా రోస్ట్ చేస్తారా..!
- Ancient tomb | దక్షిణ అమెరికాలో 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి.. భారీగా నిధులు వెలుగులోకి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

