Ancient tomb | దక్షిణ అమెరికాలో 1200 ఏళ్ల నాటి పురాతన సమాధి.. భారీగా నిధులు వెలుగులోకి
Ancient tomb | దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడ్డాయి. దాంతో శాస్త్రవేత్తలే షాక్‌కి గురయ్యారు. పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలోగల ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఈ నిధి వెలుగులోకి వచ్చింది.
Ancient tomb: దక్షిణ అమెరికాలోని పనామా సిటీలో పురాతన నాగరికతకు చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 12 శతాబ్దాల నాటి సమాధిని తవ్వుతుండగా భారీ ఎత్తున బంగారం, విలువైన వస్తువులు బయటపడ్డాయి. దాంతో శాస్త్రవేత్తలే షాక్‌కి గురయ్యారు. పనామా సిటీకి సుమారు 110 మైళ్ల దూరంలోగల ఎల్కానో ఆర్కియాలాజికల్ పార్క్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా ఈ నిధి వెలుగులోకి వచ్చింది.
తాజాగా బయటపడ్డ ఈ భారీ సమాధిలో పెద్దఎత్తున బంగారు నిధితోపాటు చాలా మృతదేహాల అవశేషాలు కూడా ఉన్నాయి. ఇది అమెరికాలోకి యూరోపియన్ల రాకకు ముందు జీవించిన స్థానిక తెగల జీవితాలను గురించి తెలియజేస్తోంది. ఈ సమాధి ఒక ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిని ఆవిష్కరిస్తుందని చెప్పొచ్చు. ఆ సమాధిలో బంగారు శాలువా, బెల్టులు, ఆభరణాలు, తిమిగలం పళ్లతో చేసిన చెవి పోగులు, విలువైన వస్తువులు ఉన్నాయని పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ జూలియా మాయో వెల్లడించారు.
సమాధిలో సుమారు 32 మృతదేహాల అవశేషాలను గుర్తించినట్లు మాయో తెలిపారు. ఆ సమాధి కోకల్ సంస్కృతికి చెందిన ఉన్నత వర్గం ప్రభువుదిగా పురావస్తు శాఖ పరిశోధకులు భావిస్తున్నారు. నాటి ఆచారం ప్రకారం.. ఉన్నత వర్గం ప్రభువు మరణిస్తే ఇలా ఈ 32 మందిని బలిచ్చి, విలువైన వస్తువులు, ఆభరణాలు పాతిపెట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. అయితే ఆ వ్యక్తుల సంఖ్య కచ్చితంగా ఎంత అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని మాయో చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pains | నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఎక్కువ కాలం పాటు నొప్పి ఉంటే ఏం జరుగుతుంది..?
Iran vs US | మా ఏడు షరతులకు ఒప్పుకునేదాకా అమెరికాతో చర్చలు జరిపేదే లేదు : ఇరాన్
Health tips | మైదా అతిగా తింటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
Manjeera Water | నిర్లక్ష్యపు తవ్వకాలతో నగరంలో మంజీరా జలాలు వృథా
Earthquake | హిందూ మహాసముద్రంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

