Viral Video : ఫెర్రీ వీల్స్‌పై చికెన్ పీస్‌లను అమర్చి కింద మంటతో కాల్చుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోకు చికెన్ ఫెయిర్ అని క్యాప్షన్ ఇచ్చారు. అమ్యూజ్మెంట్ పార్క్ ఫన్ను కుకింగ్‌తో మేళవించిన ఈ వీడియోపై ఆన్లైన్లో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఈ కాన్సెప్ట్‌ను కొందరు వెరైటీగా ఉందని కామెంట్ చేయగా పలువురు విమర్శలు గుప్పించారు. దీని ప్రాక్టికాలిటీ, ఎథిక్స్‌ను మరికొందరు ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికలపై ఈ వీడియోపై హాట్ డిబేట్ సాగుతోంది. అసాధారణ కుకింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ చికెన్ కుక్ అవాలంటే మూడు రోజులు పడుతుందేమో అని ఓ యూజర్ కామెంట్ చేయగా, విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అని మరొకరు కామెంట్ చేశారు. ఇది వంటా లేక కార్నివాలా అని మరో యూజర్ ప్రశ్నించారు.
Read More :
Vande Bharat | సికింద్రాబాద్ – విశాఖ మధ్య పట్టాలెక్కిన మరో వందేభారత్.. ప్రారంభించిన మోదీ