Viral Gulab Jamun Pizza | సోషల్ మీడియాలో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్‌తో కూడిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. పిజాలతో జనాలు తమ ఇష్టానుసారం ప్రయోగాలు చేస్తూ నెట్టింట్లో వదులుతుండటంతో యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక లేటెస్ట్గా గులాబ్ జామూన్ పిజా ఆన్లైన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ రెసిపీపై నెటిజన్లు ఓ రేంజ్లో భగ్గుమంటున్నారు. అందరూ ఇష్టంగా తినే ఇండియన్ స్వీట్‌ను పిజా బేస్‌పై ఓ వ్యక్తి స్ప్రెడ్ చేస్తున్న వీడియో ఇన్స్టాగ్రాం యూజర్లకు ఆగ్రహం కలిగించింది. ఇదేం ఫుడ్ కాంబినేషన్ అంటూ యూజర్లు విరుచుకుపడ్డారు. రియల్ఫుడ్లర్ ఈ ఇన్స్టాగ్రాం రీల్‌ను పోస్ట్ చేసింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకూ ఏకంగా 2.2 లక్షల మంది వీక్షించారు.
గులాబ్ జామూన్ పిజాపై ఇన్‌స్టా యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రెండు డిష్‌లకు ఏమైనా సంబంధం ఉందా అని ఓ యూజర్ కామెంట్ చేయగా, దయచేసి ఎవరో ఒకరు అతడిని జైలుకు పంపండని ఓ యూజర్ ఘాటుగా రాసుకొచ్చారు. టేస్ట్ కోసం ప్లీజ్ కొద్దిగా ఎలుకల మందు కలపండని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More :
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు