Mongolia | మంగోలియా చెత్త రికార్డు.. 20 ఓవర్ల ఆటలో 12 రన్స్‌కే ఆలౌట్
బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు..
Mongolia | సానొ: బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. జపాన్‌తో ఆడిన రెండో టీ20 మ్యాచ్‌లో 8.2 ఓవర్లలో 12 పరుగులకే ఆలౌట్ అయింది. బుధవారం సానొ (జపాన్) వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జపాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మంగోలియా.. 12 రన్స్‌కే కుప్పకూలి 205 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు ‘సున్నా’కే ఔటవ్వగా 4 పరుగులతో తుర్ సుమ్య టాప్ స్కోరర్. జపాన్ బౌలర్ కజుమొ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది (12) రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ఫిబ్రవరి ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ను స్పెయిన్ 10 పరుగులకే ఆలౌట్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

