Raayan | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తోన్న కుబేర షూటింగ్ దశలో ఉంది. మరోవైపు ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ రాయన్ (Raayan). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ఓ వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ్లో అడంగాథ అసురన్, తెలుగులో తలవంచి ఎరగడే, హిందీలో కోయీ తోడ్ నా ఇస్కా టైటిల్‌తో పాట విడుదల కానుంది. తమిళ వెర్షన్ సాంగ్‌ను ధనుష్ స్వయంగా రాయడం విశేషం. అవార్డ్ విన్నింగ్ కొరియోగ్రఫర్ ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేశాడు.
డీ50వ (D50)గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ లుక్‌లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. మరోవైపు రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 13న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్.
రాయన్‌లో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ ఈ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. రాయన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
రాయన్ ట్రిపుల్ బొనాంజా..
🔜 #RaayanFirstSingle – #AdangaathaAsuran | #ThalaVanchiEragade | #KoiTodNaIska, releasing today at 6pm🥳. Get set to enjoy the song in Telugu and Hindi as well 😉#Raayan in cinemas from June 2024! @dhanushkraja @sunpictures @prabhudevaofficial @iam__sjsuryah @selvaraghavan… pic.twitter.com/JkikABHEye
— A.R.Rahman (@arrahman) May 9, 2024
As #Indian2 gets postponed, Now #Dhanush‘s #Raayan is going to utilise that June-13 slot💥
The next biggie from Kollywood 🔥🔥 pic.twitter.com/Xp6CASdzGH— AmuthaBharathi (@CinemaWithAB) May 6, 2024
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023