హైదరాబాద్: లక్నో సూపర్ గెయింట్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 166 పరుగుల టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలోనే చేధించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఊచకోత కోశారు. ఆ ఇద్దరూ వీరబాదుడుకు హైదరాబాద్ ఈజీగా విజయాన్ని నమోదు చేసింది. చాలా దారుణంగా ఓటమి చెందడంతో.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) నిరుత్సాహానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ తనకు మాటలు రావడం లేదని రాహుల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత లక్నో ఓనర్ సంజివ్ గోయింకా కెప్టెన్ రాహుల్‌తో మాట్లాడారు. చాలా తీవ్రమైన రీతిలో రాహుల్‌తో సంజివ్ గోయింకా మాట్లాడడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సంజీవ్ గోయింకా ఆవేశంగా మాట్లాడుతుండగా.. రాహుల్ ఏదో సమాధానం ఇస్తున్నట్లు కనిపించింది. మరో వీడియోలో కోచ్ జస్టిన్ లాంగర్‌కు కూడా గోయింకా క్లాసు పీకుతున్నట్లు తెలుస్తోంది.
Post match meet b/w Sanjiv Goenka & KL Rahul. #IPL2024 | #LSG pic.twitter.com/hGXmrVsCQV
— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) May 8, 2024