ఇస్లామాబాద్ : ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాల జట్లు బిజీగా ఉన్నాయి. క్రీడాకారులు దాదాపు ఏదో ఒక పోటీలో తన సామర్ధ్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఐపీఎల్ కూడా ప్రారంభం కానున్నాయి. అయితే, పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం ఆడటానికి మ్యాచుల్లేకి గోళ్లు గిల్లుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి క్రికెటర్లు బయటకు వెళ్లడానికి జంకే పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖానేవాల్ క్రికెట్ స్టేడియం (Cricket Stadium) నామరూపాల్లేకుండా పోయింది. ప్రస్తుతం అక్కడ పచ్చి మిర్చి, గుమ్మడికాయల వంటి పంటలు పండిస్తున్నారు.
ఒకప్పుడు పచ్చికతో అలరారిన ఖానేవాల్ క్రికెట్ స్టేడియం పంట పొలంగా మారింది. అప్పుడు పచ్చిక కోసం నీరు చిలకరించాల్సి రాగా.. ఇప్పుడు కూరగాయల కోసం నీరు పెట్టాల్సి వస్తున్నది. గతంలో ఇక్కడ ఎన్నో విదేశాల జట్లు తమ ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. అయితే, విదేశీ జట్లపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో ఆడేందుకు రావాలంటే దాదాపు అన్ని జట్లు జంకుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌లోని క్రికెట్ స్టేడియంల నిర్వహణ కాస్తా తలనొప్పిగా తయారైంది. ముందు ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతుండగా.. వీటి నిర్వహణకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి రావడంతో వాటిని గాలికొదిలేశారు. దాంతో స్టేడియంలో స్థానికులు కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. పచ్చి మిర్చి, గుమ్మడికాయలు, వంకాయలు పండించి సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ స్టేడియాన్ని నిర్మించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసింది. పంజాబ్ ప్రావిన్స్‌లో మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న సదుద్దేశంతో ఈ స్టేడియంను నిర్మించారు. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ స్టేడియంలో కూరగాయలు పండిస్తుండటంతో పలువురు క్రికెటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మందికి అండగా నిలిచిన ఈ స్టేడియంను ఇలా గాలికొదిలేయడం పట్ల రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయాబ్ అక్తర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్టేడియం దుస్థితిని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్టేడియంను ఏవిధంగా నాశనం చేశారో చూడండి.. అధికారులారా ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
Where are authorities????
— Shoaib Jatt (@Shoaib_Jatt) August 16, 2021
Look how they are destroying 🏏 stadium, how they are playing with future of 🇵🇰, this is KHANEWAL’s Cricket Stadium’ Sad story….
کاش کسی کو پاکستان کے مستقبل کی فکر ہو تو یہ مرچیں کھلاڑیوں کے زخموں پر نہ لگیں pic.twitter.com/r3A8K2UfWt
మసకబారుతున్న జో బైడెన్ గ్రాఫ్.. ఎందుకో తెలుసా?
భారీ బోనస్ ప్రకటించిన టాటా స్టీల్
ఢిల్లీ బస్సులపై సీబీఐ విచారణ షురూ!
ఇరాన్లో కరోనా సంక్షోభం.. బ్లాక్‌లో వ్యాక్సిన్లు
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్‌తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..