మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 18, 2020 , 01:22:58

పృథ్వీ షా ఈసారైనా..

 పృథ్వీ షా ఈసారైనా..

గత పర్యటనకు ఎంపికై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డ యువ ఆటగాడు పృథ్వీ షా ఈ పర్యటనలో ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. అరంగేట్రం టెస్టులోనే శతక్కొట్టి అంచనాలు పెంచిన పృథ్వీ ఆ తర్వాత గాయాల కారణంగా వెనుకబడిపోయాడు. అయితే కంగారూ గడ్డపై దుమ్మురేపి టీమ్‌ఇండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవాలనుకుంటున్న పృథ్వీ.. ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. షమీ, ఉమేశ్‌, జడేజా, కుల్దీప్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా బ్యాటింగ్‌ చేస్తుండగా.. నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌నుంచి కోహ్లీ పరిశీలిస్తున్న వీడియోను పృథ్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.