IND vs SA : ముక్కోణపు సిరీస్‌లో భారత అమ్మాయిలు జోరు చూపిస్తున్నారు. తొలి పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించింది. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 15 పరుగుల తేడాతో సఫారీలపై గెలుపొందింది. దాంతో, ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది.
భారత జట్టు నిర్దేశించిన 277 పరుగుల ఛేదనలో ఓపెనర్ తంజిమ్ బ్రిట్స్(109) సెంచరీతో చెలరేగి జట్టును గెలుపు వాకిట నిలిపింది. అయితే.. ఆల్‌రౌండర్ స్నేహ్ రానా(5-43) కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దాంతో, ప్రత్యర్థిని భారత్ 261 పరుగులకే కట్టడి చేసింది. తన అద్భుత ప్రదర్శనతో జట్టుకు విజయాన్నందించిన రానా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.
South Africa’s chase fell apart after centurion Tazmin Brits retired hurt – two wins from two for India in the tri-series!
Scorecard: https://t.co/qmmJzgBGZW pic.twitter.com/airCUmcR2K
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025
వరల్డ్ కప్ సన్నాహకాల్లో ఉన్న భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముక్కోణపు సిరీస్‌లో వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించిన హర్మన్‌ప్రీత్ కౌర్.. దక్షిణాఫ్రికా నుంచి విజయాన్ని లాగేసుకుంది. తొలుత ఓపెనర్ ప్రతీకా రావల్(74) అర్ధ శతకంతో శుభారంభం ఇవ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(41), కెప్టెన్ హర్మన్‌ప్రీత్(41)లు దంచేశారు. ఆఖర్లో రీచా ఘోష్(24) మెరుపులతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.
The serious heat in Colombo forced Tazmin Brits to retire hurt after reaching her hundred, and she couldn’t get South Africa over the line when she returned in the 48th over https://t.co/qmmJzgBGZW | #INDvSA pic.twitter.com/hxIrzuw407
— ESPNcricinfo (@ESPNcricinfo) April 29, 2025
భారీ ఛేదనలో సఫారీ జట్టు దీటుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు లారా వొల్వార్డ్(43), తంజిమ్ బ్రిట్స్(109)లు భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ధాటిగా ఆడారు. దాంతో, తొలి వికెట్‌కు దక్షిణాఫ్రికా 140 రన్స్ జోడించింది పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే.. లారాను ఔట్ చేసిన దీప్తి శర్మ బ్రేకిచ్చింది. ఆ తర్వాత బంతి అందుకున్న స్నేహ్ రానా(5-43) వరుసగా వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేసంది. దాంతో, మిడిలార్డర్ చేతులెత్తేయగా సఫారీలు 261 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ, అరుంధతీ రెడ్డిలు తలా ఒక వికెట్ల తీశారు.