చార్మినార్, ఏప్రిల్ 29: యాకుత్పురా నియోజకవర్గంలో చాలా రోజులుగా కొనసాగుతున్న నాలా అభివృద్ధి పనులను వర్షాకాలంలోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అధికారులను ఆదేశించారు. చార్మినార్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నాడు నియోజకవర్గ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గంగా నగర్ నాలాతో పాటు వరద నీటి కాలువల అభివృద్ధి పనులు నెమ్మదించాయని అన్నారు. ఆ పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి డీఆర్ఎఫ్ సిబ్బందితో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.