హైదరాబాద్/ జగిత్యాల : ప్రజాకవి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి ( Nandini Sidhareddy) కి కేంద్ర సాహిత్య అకాడమీ ( Kendra Sahitya Akademi Award ) పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. కోవిడ్-19 సమయంలో సమాజంలోని వేదన, భయం, మానవీయ కోణాలను వ్యక్తపరుస్తూ సిధారెడ్డి రచించిన ‘అనిమేష’ ( Upadrava Kavyam Animesha ) గ్రంథానికి గాను ఈ అవార్డు ప్రకటించినట్లు అకాడమీ తెలిపింది.
ఈ నెల 31న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాలకు చెందిన కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు , ప్రధాన అడ్మిన్ కవయిత్రి అయిత అనిత, మద్దెల సరోజన, లక్కరాజు శ్రీలక్ష్మి, ములస్తం లావణ్య, కటుకం కవిత, మాడిశెట్టి శ్రీనివాస్, ఓదెల గంగాధర్, డా. శ్యామ్ సుందర్, రుద్రాంగి కమల, రుద్ర మాణిక్యం తదితరులు హర్షం వెలిబుచ్చారు.