IPL 2026 : చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ఈ మైదానంలో ఆరంభ మ్యాచ్ జరగడంపై నెలకొన్న సందేహాలకు తెరపడింది. దాదాపు ఏడాది కాలంగా ఒక్క మ్యాచ్‌కు నోచుకోని చిన్నస్వామిలో ఐపీఎల్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం సోమవారం కర్నాటక క్రికెట్ సంఘానికి అధికారికంగా అనుమతులు జారీ చేసింది. ఈ విషయాన్ని ‘క్రిక్‌బజ్’తో కేఎస్‌సీఏ సెక్రటరీ సంతోష్ మీనన్(Santhosh Menon) వెల్లడించాడు.
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమవుతోంది. తొక్కిసలాటతో అప్రతిష్టపాలైన ఈ మైదానానికి పూర్వవైభవం తీసుకొస్తామని మాటిచ్చిన కర్నాటక ప్రభుత్వం ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది. మైదానంలోని నిర్మాణపరమైన మార్పుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నిపుణుల కమిటీ.. ప్రభుత్వానికి సానుకూలంగా నివేదిక సమర్పించింది. దాంతో.. చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు రాష్ట్ర పభ్రుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది.
The immediate implication is that Chinnaswamy is scheduled to host the season opener between RCB and SRH on March 28
Full story: https://t.co/FLfFNARkFO pic.twitter.com/b2ykTIGuEH
— ESPNcricinfo (@ESPNcricinfo) March 16, 2026
‘ఈ రోజు ఉదయం విధాన సభలో మంత్రి డాక్టర్.జీ.పరమేశ్వర్, నిపుణుల కమిటీ ప్రతినిధులు, కర్నాటక క్రికెట్ సంఘం, ఆర్సీబీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా.. చిన్నస్వామి స్టేడియంలో ఈమధ్య చేసిన నిర్మాణపరమైన మార్పులు, అభిమానుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించిన నివేదికను ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సమర్పించింది. కమిటీ పేర్కొన్న అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన హోం మంత్రి ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుమతిచ్చారు.

చిన్నస్వామికి పూర్వ వైభవం తేవడం కోసం కేసీఎస్ అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, ఆర్సీబీ యాజమాన్యం హోం మంత్రిని కలిసి పలుమార్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, నిపుణుల కమిటీ, నిపుణుల ఉప కమిటీ, రాష్ట్రంలోని సీనియర్ అధికారులు ఎంతో కృషి చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో ఆర్సీబీ యాజమాన్యానికి కేసీఎస్ పూర్తిగా సహకరిస్తుంది’ అని కేసీఎస్ సెక్రటరీస సంతోష్ మీనన్ తెలిపారు. 19వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిన్నస్వామిలో ఢీకొట్టనుంది.
నిరుడు జూన్ 4వ తేదీన తొక్కిసలాటలో 11 మంది మరణించడంతో చిన్నస్వామి స్టేడియం మూత పడింది. భద్రతాపరమైన లోపాలు ఉన్నందున చిన్నస్వామిలో మ్యాచ్‌ల నిర్వహణకు కోర్టు ససేమిరా అంది. పోలీసులు కూడా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ ఇవ్వలేదు. దాంతో.. అప్పటి నుంచి ఆ మైదానంలో ఒక్క క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ ప్రసాద్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గం పూర్వవైభవంపై దృష్టి సారించింది. ఈ మేరకు ఆర్సీబీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. చిన్నస్వామిలో భద్రతపై భరోసా కల్పించేందుకు అనువైన చర్యలను ప్రకటించింది.
🚨 TOP 3 GUIDELINES FOR CHINNASWAMY STADIUM FOR IPL 2026 🚨
1) Only 30,000 Spectators allowed for RCB vs SRH Opening Match
2) No celebrations are allowed outside the stadium after the match
3) Control of Entry and Exit point– What’s your take 🤔pic.twitter.com/InOT9cApBw
— Fan Account Richard Kettlebourogh (@RichKettle07) March 11, 2026
కృత్రిమ మేధతో పనిచేసే కెమెరాల సాయంతో పోలీసులు ప్రేక్షకుల మధ్య తోపులాట జరగకుండా చూస్తారు. అంతేకాదు స్టేడియంలోకి అభిమానులను అనుమతించేటప్పుడు, మ్యాచ్ అనంతరం బయటకు వెళ్లేటప్పుడు క్యూలో వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. తద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది, ప్రమాదం జరగకుండా చూసుకుంటామని ఆర్సీబీ, కేఎస్‌సీఏ అంటున్నాయి. అందుకని ఒక్కసారే స్టేడియమంతా రూ.4.5 కోట్లు ఖర్చుతో ఈ ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని ఫ్రాంచైజీ వెల్లడించింది.