IPL 2025 : ప్లే ఆఫ్స్ పోరు ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కీలక మ్యాచ్కు సిద్ధమయ్యాయి. వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ సారథి అక్షర్ పటేల్(Axar Patel) బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, 7వ స్థానంలో ఉన్న కోల్కతా ఈ మ్యాచ్లో భారీ స్కోర్ లక్ష్యంగా ఆడనుంది. ఇప్పటివరకూ ఇరుజట్లు 33సార్లు తలపడగా కోల్కతా 18 విజయాలతో పైచేయి సాధించింది. అయితే.. ఈ సీజన్లో భారీ స్కోర్లతో అలరిస్తున్న ఢిల్లీ ధాటికి కోల్కతా నిలుస్తుందా? లేదా? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఢిల్లీ తుది జట్టు : ఫాఫ్ డూప్లెసిస్, అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముకేశ్ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ : అశుతోష్ శర్మ, జేక్ఫ్రేజర్ మెక్గుర్క్, త్రిపురన విజయ్, సమీర్ రిజ్వీ, డోనొవాన్ ఫెరీరా.
🚨 Toss 🚨 @DelhiCapitals won the toss and elected to bowl against @KKRiders
Updates ▶ https://t.co/saNudbWINr #TATAIPL | #DCvKKR pic.twitter.com/VDNUH29eTK
— IndianPremierLeague (@IPL) April 29, 2025
కోల్కతా తుది జట్టు : రహ్మనుల్లా గుర్జాబ్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రూ రస్సెల్, రొవ్మన్ పావెల్, హర్షిత్ రానా, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి.
ఇంప్యాక్ట్ సబ్స్ : మనీశ్ పాండే, లవ్నీత్ సిసోడియా, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరా, రమన్దీప్ సింగ్.