IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) భారీ స్కోర్ కొట్టింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(83), ప్రియాన్ష్ ఆర్య(69) మరోసారి రెచ్చిపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించిన ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌లు అర్ధ శతకాలతో చెలరేగారు. వీళ్లిద్దరి విధ్వంసంతో పంజాబ్ భారీ స్కోర్ కొట్టింది. ఆఖర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ముల్లనూర్‌లో కోల్‌కతా బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలిన పంజాబ్ కింగ్స్ ఈసారి భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వైభవ్ అరోరా వేసిన తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్య(69) బౌండరీ రాబట్టాడు. ఔట్ సైడ్ పడిన చివరి బంతిని ఫోర్‌గా మలిచాడు. సకారియా రెండో ఓవర్లో రెచ్చిపోయిన ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్(83)లు బౌండరీలతో చెలరేగారు. 18 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ జోడీ కోల్‌కతా బౌలర్లను ఉతికేశారు. హర్షిత్ రానా వేసిన 5వ ఓవర్లో సిక్సర్ బాదిన ప్రభ్‌సిమ్రన్.. స్కోర్ 50 దాటించాడు. వీళ్లిద్దరూ ధనాధన్ ఆడడంతో అయ్యర్ సేన పవర్ ప్లేలో 56 రన్స్ కొట్టింది.
Putting on a show 👏
Prabhsimran Singh brings up his 2️⃣nd half-century this season and is racing along 💪
Updates ▶ https://t.co/oVAArAaDRX #TATAIPL | #KKRvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/iHT30fieEu
— IndianPremierLeague (@IPL) April 26, 2025
ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన ప్రియాన్ష్.. కోల్‌కతాపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. హర్షిత్ రానా వేసిన 10 ఓవర్లో వరుసగా4, 6, 4 బాదిన ప్రియాన్ష్ ఫిఫ్టీ సాధించాడు. ఆండ్రూ రస్సెల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్ స్వీప్ షాట్లతో అలరిస్తూ.. అర్ధ శతకం సాధించాడు. సెంచరీ దిశగా వెళ్తున్న అతడిని వైభవ్ ఔట్ చేసి కోల్‌కతాను ఊపిరితీసుకోనిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్(7), మార్కో యాన్సెన్(3)లు విఫలం అయ్యారు. వరుసగా 3 వికెట్లు పడడంతో పంజాబ్ స్కోర్ వేగం తగ్గింది. అయితే.. శ్రేయాస్ అయ్యార్(25నాటౌట్), జోష్ ఇంగ్లిస్(11 నాటౌట్)లు ధాటిగా ఆడారు. ఆఖరి రెండు ఓవర్లలో ఇంగ్లిస్ దంచికొట్టాడు. రస్సెల్ వేసిన 20వ ఓవర్లో బౌండరీతో స్కోర్ 200 దాటించాడు.