Candle rally | ఝరాసంగం, ఏప్రిల్ 26 : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మహామండలేశ్వర పీఠం, బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి 1008 డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నివాళిగా ఇవాళ సాయంత్రం దత్తగిరి మహారాజ్ ఆశ్రమ ఆవరణలో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
దాడిలో అమరులైనవారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాతృశ్రీ అనసూయ మాత, రాచయ్య స్వామి, నందిని శ్రీ మాత, శ్రీపాద స్వామి, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.
కోహీర్, ఏప్రిల్26: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన మారణహోమానికి నిరసనగా మండలంలోని దిగ్వాల్ గ్రామంలో ఇవాళ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హనుమాన్ దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళులర్పించారు. మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా