IPL 2025 : భారత జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) తన ఆటతోనే కాదు డేటింగ్ రూమర్స్తోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. గత కొన్ని రోజులుగా ఈ యంగ్‌స్టర్ మాజీ క్రికెటర్ కూతురుతో, బాలీవుడ్ నటితో లవ్ ట్రాక్ నడుపుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ కూతురు సారా(Sara)తో, నటి సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)తో ప్రేమలో ఉన్నాడనే వదంతులతో విసిగిపోయిన గిల్.. తన లవ్ లైఫ్ గురించి వస్తున్న అపోహలపై స్పందించాడు. తాను మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని.. ఎవరితోనూ ప్రేమలో లేనని కుండబద్ధలు కొట్టాడు.
‘నేను ఎవరినీ లవ్ చేయడం లేదు. మూడేళ్లుగా సింగిల్‌గానే ఉంటున్నా. అయినా సరే.. కొందరితో నేను డేటింగ్ చేస్తున్నట్టు కథనాలు ప్రచారం చేస్తున్నారు. నేను జీవితంలో ఒక్కసారి కూడా కలవని వ్యక్తులతో నాకు సంబంధం అంటగడుతున్నారు. ప్రస్తుతానికైతే నా దృష్టంతా క్రికెట్ మీదే ఉంది. ఏడాదిలో 300 రోజులకుపైగా క్రికెట్ గురించే ఆలోచిస్తా.
Shubman Gill has finally said it about his dating rumours with sara tendulkar. pic.twitter.com/GrThDLxCoR
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025
అలాంటప్పుడు రిలేషన్షిప్లో ఉండేంత తీరిక నాకు లేదు. క్రికెట్‌తోనే నాకు పొద్దు పోతోంది. సో.. వదంతులకు ఇకనైనా ముగింపు పలకండి’ అని గిల్ వెల్లడించాడు. ఈమధ్యే బాలీవుడ్ నటి అవ్నీత్ కౌర్(Avneet Kaur)తో గిల్ ప్రేమాయాణం నడుపుతున్నాడనే వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి అందరికీ స్పష్టత ఇవ్వాలనుకున్నాడీ టీమిండియా స్టార్.
ఐపీఎల్ 18వ సీజన్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది గిల్ సేన. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో ఓపెనర్‌గా, సారథిగా రాణిస్తూ గుజరాత్ టైటాన్స్‌ను టేబుల్ టాపర్‌గా నిలిపాడీ యంగ్‌స్టర్. అయితే.. ఈమధ్యే టాస్ సమయంలో గిల్‌ను ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్?’ అని కామెంటేటర్ డాని మోరిసన్ అడిగిన విషయం తెలిసిందే. ఊహించని ప్రశ్న ఎదురువడంతో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిగ్గుపడిపోయాడు. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, తన ధ్యాసంతా క్రికెట్ మీదనే అని బదులిచ్చాడు.
Head down. Work in. Wins out ⚡️💙 pic.twitter.com/tXBERKumUy
— Shubman Gill (@ShubmanGill) April 21, 2025