IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య(54) మరోసారి రెచ్చిపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ అర్ధ శతకం బాదేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. హర్షిత్ రానా వేసిన 10 ఓవర్లో వరుసగా4, 6, 4 బాదిని ప్రియాన్ష్ ఫిఫ్టీ సాధించాడు. మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(34)సైతం దూకుడుగా ఆడుతున్నాడు. దాంతో, 10 ఓవర్లకు పంజాబ్ వికెట్ కోల్పోకుండా 90 రన్స్ కొట్టింది.
టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వైభవ్ అరోరా వేసిన తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్య(54) బౌండరీ రాబట్టాడు. ఔట్ సైడ్ పడిన చివరి బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాత చేతన సకారియా 3 పరుగులే ఇచ్చాడు. అయితే.. సకారియా రెండో ఓవర్లో రెచ్చిపోయిన ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్ (34)లు బౌండరీలతో చెలరేగారు. 18 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ జోడీ కోల్‌కతా బౌలర్లను ఉతికారేసింది.