Drinking Water | దుండిగల్, ఏప్రిల్ 26: దుండిగల్‌లో నెలకొన్న తాగు నీటి సమస్యను పరిష్కరించాలని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం దుండిగల్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుండిగల్‌లో గత కొంతకాలంగా తాగునీటికి ఎద్దడి నెలకొందన్నారు.
అదేవిధంగా గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్‌లోనూ మున్సిపాలిటీకి చెందిన నీటిని ,బిల్డింగ్నీ వాడుకుంటూ ప్రైవేట్ వారిలా అధికంగా రుసుమును వసూలు చేస్తున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించడంతోపాటు వాటర్ ప్లాంట్ వద్ద అధికంగా బిల్లులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ కావలి గణేష్, మాజీ కౌన్సిలర్ అమరం గోపాల్ రెడ్డి, నాయకులు తురాయి పండుగౌడ్, దొంతి మహేష్ ముదిరాజ్, జక్కుల గోపాల్ యాదవ్, ఉప్పరి కృష్ణ, ఇటూరి వేణుగోపాల్, వాపుల శ్రీనివాస్, తక్కడ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా