IPL 2025 : వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ జైపూర్‌లో కొండంత స్కోర్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు రియాన్ రికెల్టన్(61), రోహిత్ శ్మ(53)లు మరోసారి శుభారంభం ఇచ్చారు. ధాటిగా ఆడిన ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి భారీ స్కోర్‌కు పునాది వేశారు. సెంచరీ భాగస్వామం నెలకొల్పిన వీళ్లు వెనువెంటనే ఔట్ కాగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(48 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(48 నాటౌట్)లు దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ దాటించారు. రాజస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించిన ఈ జోడీ 44 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. దాంతో, ముంబై నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి 217 రన్స్ చేసింది. గత మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఊది పడేసిన రాజస్థాన్ ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల వరద పారిస్తూ రాజస్థాన్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచిన పరాగ్ ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు రియాన్ రికెల్టన్(61), రోహిత్ శర్మ(53)లు మొదట్లో ఆచితూచి ఆడినా.. క్రీజులో పాతుకుపోయాక స్కోర్‌బోర్డును ఉరికించారు. పోటా పోటీగా బౌండరీలతో అలరించగా పవర్ ప్లేలోనే ముంబై స్కోర్ 58కి చేరింది.
Rocket Ryan tonight was a MOOD! 🚀 #MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMIpic.twitter.com/96TMMlaKO9
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
ఆర్చర్, థీక్షణ, కార్తికేయ.. ఇలా అందరి ఓవర్లలో ఈ జోడీ దంచేసింది. మొదట రికెల్టన్ అర్ధ శతకం సాధించగా.. కాసేపటికే హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే.. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని థీక్షణ విడదీశాడు. అతడు రికెల్టన్ను బౌల్డ్ చేయగా.. మరో 7 పరుగులకే రోహిత్‌ను పరాగ్ పెవిలియన్ పంపాడు. దాంతో, 12.4 ఓవర్ల వద్ద ముంబై రెండు వికెట్లు పడ్డాయి.
ఓపెనర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో రాజస్థాన్ బౌలర్లు ఊపిరిపీల్చుకున్నారు. కానీ, ఆ తర్వాత సూర్యుకుమార్ యాదవ్(48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(48 నాటౌట్)లు విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగారు. థీక్షణ వేసిన 16వ ఓవర్లో గేర్ మార్చిన వీళ్లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆ ఓవర్లో సూర్య సిక్సర్‌తో జట్టు స్కోర్ 160 దాటింది.
𝐇𝐏™ 🔥💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/WwgOM4fHxa
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో సూర్య ఫైన్‌లెగ్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. ఫజల్ హక్‌ను టార్గెట్ చేసిన పాండ్యా 4, 6, 4, 4 తో 21 రన్స్ సాధించాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో సూర్య కొట్టిన బౌండరీతో ముంబై స్కోర్ 200 దాటింది. ఆకాశ్ మధ్వాల్ వేసిన 20వ ఓవర్లో పాండ్యా 4, సూర్య సిక్సర్ బాదగా ముంబై ప్రత్యర్థికి 218 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది.