– ఇండియన్ గిల్లీదండ ఫెడరేషన్ అధ్యక్షుడు సోనిభరత్ ఉత్తర్వులు జారీ
రామగిరి, మార్చి 07 : తెలంగాణ గిల్లీదండ అసోసియేషన్ రాష్ట్ర బాద్యుడిగా నల్లగొండ పట్టణ కేంద్రంలోని కేపీఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల- బొట్టుగూడ ఫిజికల్ డైరెక్టర్ బొమ్మపాల గిరిబాబు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత క్రీడ అయిన గిల్లీదండ (జిల్లగోనె) ఆటను జూతీయ స్థాయిలో ప్రాచ్చుర్యం తెచ్చేలా అసోసియేషన్ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. తనను నియమకం చేసిన ఇండియాన్ గిల్లీ దండ ఫెడరేషన్ అధ్యక్షుడు సోనిభరత్కు ఆయన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా ఆటల్లో గ్రామీణ ప్రాంతాల క్రీడ అయిన గిల్లీదండపై నేటి యువతరంలో అవగాహన పెంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో గిల్లీదండకు బాధ్యుడిగా నియామకం కావడంతో జిల్లాలోని పలువురు పీఈటీలు, పీడీలు గిరిబాబుకు అభినందనలు తెలిపారు. గిరిబాబు ఇప్పటికే చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుతో ఉచితంగా ఎంతో మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖోతో పాటు వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నాడు. ఈయన శిక్షణలో పలువురు క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బంగారు, స్విలర్ పతకాలను సాధిస్తుండడం విశేషం.

తెలంగాణ గిల్లీదండ అసోసియేషన్ రాష్ట్ర బాధ్యుడిగా బొమ్మపాల గిరిబాబు