IPL 2025 : ఐపీఎల్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మట్టిలో టాలెంట్ స్కౌట్, కోచ్‌లకు ఓ ప్రత్యేకత ఉంది. ఊరూరా జల్లెడపట్టి మరీ మట్టిలోని మాణిక్యాలను.. ప్రతిభావంతులైన కుర్రాళ్లను వెలికితీస్తారు. 18వ ఎడిషన్‌లో రికార్డు సెంచరీ కొట్టిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అలాంటివాడే. అయితే.. ఈ యాజమాన్యానికి సామాజిక బాధ్యత కూడా ఉందండోయ్. అందుకే ఐపీఎల్ ప్రతి సీజన్లో ‘పింక్ ప్రామిస్’ (Pink Pormise) తీసుకుంటుంది రాజస్థాన్ జట్టు.
రాజస్థాన్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల జీవితాల్ని సౌకర్యంగా మార్చేయడమే ఈ ప్రామిస్ ఉద్దేశం. పింక్ ప్రామిస్లో భాగంగా మహిళలకు టికెట్ ఉండదు. వాళ్లను ఉచితంగా మ్యాచ్ చూడనిస్తారు. అంతేకాదు పింక్ జెర్సీతో ఆడే ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్లు ఎన్ని సిక్సర్లు బాదితే.. ఒక్కో సిక్సర్‌కు ఆరేసి చొప్పున సోలార్ ప్యానెళ్ల(Solar Pannels)ను ఉచితంగా ఇవ్వనుంది రాజస్థాన్ యాజమాన్యం.
3️⃣…2️⃣…1️⃣…and ACTION 🎬
🩷 🆚 💙
Updates ▶ https://t.co/t4j49gX9NW#TATAIPL | #RRvMI | @rajasthanroyals | @mipaltan pic.twitter.com/rh9ua37EKv
— IndianPremierLeague (@IPL) May 1, 2025
అంటే.. గురువారం జైపూర్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్, ముంబై బ్యాటర్లు కొట్టిన ప్రతి సిక్సర్‌కు ఆరు ఇళ్లలో సౌర వెలుగులు నిండుతాయన్నమాట. ఈ క్రతువులో భాగంగా రూ. 1900 విలువ చేసే సోలార్ ల్యాంప్‌ను పేదలకు ఉచితంగా ఇస్తారు.
ఐపీఎల్ 17వ సీజన్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో పింక్ ప్రామిస్‌ను పాటించింది రాజస్థాన్. బ్యాటర్లు కొట్టే ప్రతి సిక్సర్‌కు ఆరు ఇండ్లలో సౌర వెలుగులు నింపనుంది. అవును.. పింక్ ప్రామిస్(Pink Pormise)లో భాగంగా ఒక్కో సిక్సర్‌కు ఆరు చొప్పున సోలార్ ప్యానెళ్ల(Solar Pannels)ను ఏర్పాటు చేసింది. సాంబార్ జిల్లాతో పాటు రాజస్థాన్‌లోని పేద ఇండ్లలో సోలార్ వెలుగులు నింపింది.