రాజాపేట, మార్చి 07 : రాజాపేట మండలంలోని దూది వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్జీఎఫ్ అండర్–14 బాల బాలికల రాష్ట్రస్థాయి స్టాఫ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం విజయలక్ష్మి, పీడీ మధు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలపాలెంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ సెలక్షన్లలో విద్యార్థులు పాల్గొని విశేష ప్రతిభ కనపరిచినట్లు తెలిపారు. వారి ప్రతిభను గుర్తించిన సెలక్షన్ కమిటీ 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడలు– అండర్–14 బాల బాలికల సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక చేసిందన్నారు.
ఈ రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 7 నుండి 9 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో నిర్వహించబడతాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా తరఫున అండర్–14 విభాగంలో పాఠశాల విద్యార్థులు పాల్గొంటుంన్నారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి చేరుకునేలా మరింత కృషి చేయాలని సూచించారు.