లక్నో: మొబైల్ షాపునకు వచ్చిన ఒక వ్యక్తి రీచార్జ్ చేయమని చెప్పాడు. ఆ పనిలో ఉన్న ఓనర్ కళ్లలో కారం చల్లాడు. (Thief Throws Chilli Powder) గల్లాలోని రూ.50,000 దోచుకుని పారిపోయాడు. ఆ మొబైల్ షాపులో ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 30న పట్టపగలు సుహైల్‌కు చెందిన మొబైల్ షాపులోకి మాస్క్ ధరించిన వ్యక్తి వచ్చాడు. తొలుత రూ.19కు రీచార్జ్ చేయమని అడిగాడు. ఆ తర్వాత మరోసారి రూ.29కు రీచార్జ్ చేయమని చెప్పాడు.
కాగా, సుహైల్ రీచార్జ్‌లో బిజీగా ఉండటాన్ని ఆ వ్యక్తి గమనించాడు. జాకెట్లో దాచిన కారం పొడిని బయటకు తీశాడు. మొబైల్ షాపు ఓనర్ సుహైల్ కళ్లలో కారం చల్లాడు. తెరిచిన బాక్స్‌లో ఉన్న రూ.50,000లు తీసుకుని అక్కడి నుంచి పరుగెత్తాడు.
మరోవైపు అప్రమత్తమైన సుహైల్ ఆ దొంగను వెంబడించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ షాపునకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश के जिला बिजनौर में बदमाश ने आंखों में लाल मिर्ची पाउडर डालकर मोबाइल शॉप मालिक सुहैल से 50 हजार रुपए लूटे !!
बदमाश ने कस्टमर बनकर पहले 19, फिर 29 रुपए का रिचार्ज कराया। फिर जैकेट से मिर्ची पाउडर निकालकर दुकानदार की आंखों में फेंक दिया।@Uppolice pic.twitter.com/sy4XD8Y0JJ
— Lokmanchtoday (@lokmanchtoday) April 30, 2025