Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది కిషన్ చౌహాన్ ఫిర్యాదు మేరకు కేసు ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రెట్రో ఈవెంట్లో ఆదివాసులను అవమానించారని కిషన్ చౌహాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేరస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళ నటుడు సూర్యా నటించిన రెట్రో మూవీ ప్రమోషన్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సూర్య, హీరోయిన పూజాహెగ్డే పాల్గొన్నారు. జ్యోతిక, కార్తికేయన్ సంతానం కలిసి నిర్మించిన పాన్ ఇండియా చిత్రాన్ని కార్తీక సుబ్బరాజు దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక సితార ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని తెలుగులో విడుదల చేసింది. ఈ మూవీ గురువారం విడుదలైంది.
ఈ మూవీ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్‌కి జోడీగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నది. సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించగా.. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానున్నది.