ICC : పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా కొద్దిరోజులుగా భారత్లోనే ఉండిపోయారు విదేశీ ఆటగాళ్లు. ‘మమ్మల్ని ఎప్పుడు వెనక్కి పంపిస్తారు?’ అని వెస్టిండీస్ హెడ్కోచ్ డారెన్ సమీ (Daren Sammy) సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేయడం చూశాం. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విదేశీ ఆటగాళ్లకు తీపి కబురు చెప్పింది. త్వరలోనే వారిని స్వదేశం పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీసీ వెల్లడించింది.
వరల్డ్కప్ మధ్యలోనే మొదలైన పశ్చిమాసియా యుద్ధంతో చివరకు విదేశీ ఆటగాళ్ల పాలిట విలన్లా మారింది. యుద్దం కారణంగా పలు దేశాల గగనతలాల మూసివేయడంతో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఆటగాళ్లు మరో దారిలేక భారత్లోనే ఉండిపోయారు. దాంతో.. కొందరు ఇక్కడే ఎన్ని రోజులు ఉండాలి? అని అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నా.. మమ్మల్ని రేపు పంపిస్తారా? వచ్చే వారమా? .. ఏదో ఒకటి చెప్పండి’ అని విండీస్ కోచ్ డారెన్ సమీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
The England team will fly directly from Mumbai to London. The West Indies, along with South Africa, will depart from Kolkata for Johannesburg first, and then Antigua.
Source: ESPN Cricinfo #T20WorldCup #EnglandCricket #Proteas #WestIndies #CricketTwitter pic.twitter.com/O3fdU6rdCV
— InsideSport (@InsideSportIND) March 7, 2026
ఇండియాలోనే ఉండిపోయిన ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్రికెటర్లు, కోచింగ్ బృందాన్ని ఐసీసీ ప్రత్యేక విమానాల్లో సొంత దేశానికి తరలించనుంది. మార్చి 5న జరిగిన సెమీ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ జట్టు.. శనివారం రాత్రి ముంబై నుంచే స్వదేశానికి బయల్దేరనుంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ బృందం.. ఆదివారం కోల్కతా మీదుగా ప్రత్యేక విమానాల్లో వెళ్తారని సమాచారం. సఫారీ జట్టులోని కేశవ్ మహారాజ్, జేసన్ స్మిత్, జార్జ్ లిండే మాత్రం పరిమిత ఓటర్ల సిరీస్ కోసమని న్యూజిలాండ్ వెళ్లనున్నారు.