కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా ఉద్యోగులకు ( Women Employees ) సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ముత్యంపల్లి పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ దేవరపల్లి పుష్పలత, ఉత్తమ వైద్యురాలిగా కాసిపేట పీహెచ్ సీ వైద్యాధికారిని మాడ దివ్య, ఉత్తమ రెవెన్యూ ఉద్యోగిగా తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దుర్గం జయను సన్మానించారు.
ఉత్తమ పంచాయతీ రాజ్ ఉద్యోగిగా ధర్మరావుపేట కార్యదర్శి పెద్ది అన్నపూర్ణ, ఉత్తమ పోలీస్ ఉద్యోగిగా కాసిపేట పోలీస్ స్టేషన్ ఉద్యోగి అజ్మీర రమాదేవిని శాలువాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ నాగుల అంజయ్య, ఎంఈవో ముక్తవరం వెంకటేశ్వర స్వామి, ఎంపీవో శేక్ సఫ్దర్ అలీ, సూపరింటెండెంట్ అల్లూరి లక్ష్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, జూనియర్ అసిస్టెంట్ కోదాది తిరుపతి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంటం తిరుపతి, గౌరవాధ్యక్షులు చెట్టి శ్రీధర్, జనరల్ సెక్రటరీ కూకట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.