IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు ఎదురన్నదే లేకుండా పోయింది. బ్యాటుతో బాదేస్తూ.. బంతితో బెంబేలెత్తిస్తున్న ముంబై వరుసగా ఆరో విజయం సాధించింది. బౌల్ట్(3-28), కరన్ శర్మ(3-28)ల విజృంభణతో 100 పరుగుల తేడాతో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. మొదటగా ఓపెనర్లు రియాన్ రికెల్టన్(61), రోహిత్ శర్మ(53)లు అర్ధ శతకాలతో రెచ్చిపోగా.. సూర్యకుమార్ యాదవ్(48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(48 నాటౌట్)లు విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించారు. అనంతరం బౌల్ట్, బుమ్రాల ధాటికి రాజస్థాన్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 47 పరుగులకే రాజస్థాన్ సగం వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టును కరన్ శర్మ ఆలౌట్ అంచున నిలిపాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ పోరాటంతో స్కోర్ వంద దాటించాడు. అతడిని ఔట్ చేయడంతో ముంబై డగౌట్లో సంబురాలు మొదలయ్యాయి.
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 18వ సీజన్లో జైత్రయాత్ర కొనసాగిస్తోంది. వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన పాండ్యా సేన ఆరో గెలుపుతో 14 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై.. రాజస్థాన్‌ను 100 పరుగుల తేడాతో ఓడించింది. భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓవర్ నుంచే షాక్‌లు తగిలాయి. గుజరాత్ టైటాన్స్‌పై రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(0) డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వైభవ్ టైమింగ్ మిస్ అవ్వగా విల్ జాక్స్ గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ అందుకున్నాడు.
⚡🎯😎#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMIpic.twitter.com/ebdIXe2NmI
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది ఆత్మవిశ్వాసంతో కనిపించిన యశస్వీ జైస్వాల్(13).. అదే ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, 18 పరుగులకే రాజస్థాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో నితీశ్ ఔట్ కాగా.. కాసేపటికే పరాగ్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హెట్‌మైర్(0) తొలి బంతికే సూర్యకు సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ శుభం దూబే(15) రెండు సిక్సర్లతో అలరించినా పాండ్యా బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద బౌల్ట్ చేతికి చిక్కాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(11)ల్ను ఔట్ చేసిన కరన్ శర్మ రాజస్థాన్ ఓటమిని ఖరారు చేశాడు. అయితే.. జోఫ్రా ఆర్చర్(30) కాసేపు పోరాడాడు. దాంతో, రాజస్థాన్ 100 పరుగులు చేయగలిగింది. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత బౌల్ట్ బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ పట్టడంతో ఆర్చర్ ఔటయ్యాడు. ముంబై 100 రన్స్ తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకూ ప్రత్యర్థికి 200 ప్లస్ లక్ష్యాన్నినిర్ధేశించిన ప్రతిసారి ముంబై జయకేతనం ఎగురవేసింది.
వరుసగా ఐదు విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్ జైపూర్‌లో కొండంత స్కోర్ కొట్టింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్లు రియాన్ రికెల్టన్(61), రోహిత్ శ్మ(53)లు మరోసారి శుభారంభం ఇచ్చారు. ధాటిగా ఆడిన ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగి భారీ స్కోర్‌కు పునాది వేశారు. సెంచరీ భాగస్వామం నెలకొల్పిన వీళ్లు వెనువెంటనే ఔట్ కాగా.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(48 నాటౌట్), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(48 నాటౌట్)లు దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీ దాటించారు.
The batters take us to our highest-ever score at the SMS stadium in #TATAIPL 💙
Time now for our bowlers to shine ✨#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/c7vNavFyJR
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
ఫజల్ హక్‌ను టార్గెట్ చేసిన పాండ్యా 4, 6, 4, 4 తో 21 రన్స్ సాధించాడు. ఆర్చర్ వేసిన 19వ ఓవర్లో సూర్య కొట్టిన బౌండరీతో ముంబై స్కోర్ 200 దాటింది. ఆకాశ్ మధ్వాల్ వేసిన 20వ ఓవర్లో పాండ్యా 4, సూర్య సిక్సర్ బాదగా 13 రన్స్ వచ్చాయి. డెత్ ఓవర్లలో ఊచకోత కోసిన జోడీ 44 బంతుల్లోనే 94 పరుగులు చేసింది. దాంతో, ముంబై నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి 217 రన్స్ చేసింది.