IPL 2025 : భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్. రెండో ఓవర్‌కే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. మొదట గత మ్యాచ్‌లో రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(0) డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మిడాన్‌లో షాట్ ఆడిన వైభవ్ టైమింగ్ మిస్ అయింది. 30 యార్డులోనే విల్ జాక్స్ క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన యశస్వీ జైస్వాల్(13).. పెద్ద షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, 18 పరుగులకే రాజస్థాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ప్రస్తుతం నితీశ్ రానా(5), కెప్టెన్ రియాన్ పరాగ్(2) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లకు స్కోర్.. 27-2. ఇంకా రాజస్థాన్ విజయానికి 191 పరుగులు కావాలి. అయితే.. ఇప్పటివరకూ 200 ప్లస్ లక్ష్యాన్ని ముంబై కాపాడుకుంటూ వస్తోంది. ఐపీఎల్లో 16 పర్యాయాలు ముంబై రెండొందలకు పైగా కొట్టిన ప్రతి మ్యాచ్‌లో ప్రత్యర్థిని అంతకంటే తక్కువకే కట్టడి చేసింది.