Shikhar Dhawan : భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) మళ్లీ ప్రేమలో పడ్డాడు. గత కొంతకాలంగా తన లవ్ లైఫ్‌పై వస్తున్న వందతులకు చెక్ పెడుతూ తన కొత్త ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు. గురువారం తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్(Sophie Shine)ను అందరికీ పరిచయం చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడీ మాజీ ఓపెనర్. దాంతో నెటిజన్లు అందరూ ఇంతకూ ఎవరీ సోఫీ..? అని చర్చించుకుంటున్నారు.
టీమిండియా గొప్ప ఓపెనర్లలో ఒకడైన ధావన్ 2022లో జట్టుకు దూరమయ్యాడు. ఆ సమయంలో భార్య అయేషా ముఖర్జీ(Ayesha Mukherjee)తో 11 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికిన గబ్బర్ 2023లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న అతడు.. కుమారుడు జొరావర్‌ను ఎంతో మిస్ అవుతున్నాని, రాత్రిళ్లు ఒంటరిగా నిద్ర పట్టడం లేదని పలు సందర్భాల్లో తెలిపాడు. అయితే.. సోఫీ షైన్ రాకతో తన జీవితంలో మళ్లీ సంతోషం నిండింది అంటున్నాడీ డేంజరస్ బ్యాటర్.
సోఫీయా షైన్ సొంత దేశం ఐర్లాండ్. కాస్ట్లేట్రోయ్ కాలేజీలో చదివిన ఈ అందగత్తె ఆ తర్వాత మార్కెటింగ్, మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం సోఫియా ప్రొడక్ట్ కన్సల్టంట్గా పని చేస్తోంది. అబుదాబీలోని నార్తర్న్ ట్రస్ట్ కోఆపరేషన్ సంస్థలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో లక్ష 34 వేలమంది ఫాలోవర్లు ఉన్నారు. దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పటి నుంచి ధావన్, సోఫీయాలు జంటగా కనిపిస్తున్నారు.