IPL 2025 : జైపూర్‌లో ముంబై ఇండియన్స్ పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. కొండంత స్కోర్‌ను కరిగిస్తారనుకుంటే రాజస్థాన్ బ్యాటర్లు మాత్రం బౌల్ట్, బుమ్రాల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. దాంతో, 47 పరుగులకే రాజస్థాన్ సగం వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 18 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్ చేరిన జట్టును నితీశ్ రానా(9), రియాన్ పరాగ్(16)లు ఆదుకునే ప్రయత్నం చేశారు.
కానీ, బౌల్ట్ బౌలింగ్‌లో నితీశ్ ఔట్ కాగా.. కాసేపటికే పరాగ్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హెట్‌మైర్(0) తొలి బంతికే సూర్యకు సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఇంప్యాక్ట్ ప్లేయర్ శుభం దూబే(14), వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(1)లు క్రీజులో ఉన్నారు. 6 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్.. 62-5. ఇంకా విజయానికి 156 పరుగులు కావాలి.
𝗕𝗢𝗢𝗠 • 𝗕𝗢𝗢𝗠 – Back to back wickets for JB 💥#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #RRvMI pic.twitter.com/95D6Tgoj8N
— Mumbai Indians (@mipaltan) May 1, 2025
భారీ ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు తొలి ఓవర్ నుంచే షాక్‌లు తగులుతున్నాయి. గుజరాత్ టైటాన్స్‌పై రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ(0) డకౌటయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో వైభవ్ టైమింగ్ మిస్ అవ్వగా విల్ జాక్స్ గాల్లోకి లేచిన బంతిని క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది ఆత్మవిశ్వాసంతో కనిపించిన యశస్వీ జైస్వాల్(13).. అదే ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, 18 పరుగులకే రాజస్థాన్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నితీశ్ రానా(9), కెప్టెన్ రియాన్ పరాగ్(16), హెట్‌మైర్(0)లు సైతం చేతులెత్తేయడంతో ముంబై విజయం దిశగా సాగుతోంది.