IPL 2025 : నామమాత్రపు పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) భారీ స్కోర్ అవకాశాన్ని చేజార్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ఉతికారేసిన ఓపెనర్ ఆయుశ్ మాత్రే(43) మెరుపు బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ఉరికించాడు. అయితే.. యుధ్వీర్ సింగ్(3-47) వరుసగా వికెట్లు తీసి సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టాడు. 5 వికెట్లు పడిన దశలో డెవాల్డ్ బ్రెవిస్(42), శివం దూబే(39) ఆరో వికెట్‌కు 59 రన్స్ జోడించి ఆదుకున్నారు. ఈ ఇద్దరి మెరుపులతో సీఎస్కే 200 ప్లస్ కొట్టడం ఖాయనిపించింది. అయితే.. బ్రెవిస్ ఔటయ్యాక స్కోర్ వేగం తగ్గింది. డెత్ ఓవర్లలో బ్యాట్ ఝులిపించిన దూబే, ధోనీలు 7వ వికెట్‌కు 43 పరుగులు జోడించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. యుధ్వీర్ సింగ్(3-47) ఓకే ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే(10), యువకెరటం ఉర్విల్ పటేల్(0) ఔట్ చేశాడు. దాంతో, 12 పరుగులకే చెన్నై రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే.. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అశ్విన్(12).. ఓపెనర్ ఆయుష్ మాత్రే(43 : 20 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్)కు అండగా చెన్నై నిలిచాడు.
Innings Break!
Cameos from Ayush Mhatre, Dewald Brevis and Shivam Dube help #CSK post a competitive total of 187/8 🙌#RR‘s chase 🔜
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR pic.twitter.com/9K0WRewn2y
— IndianPremierLeague (@IPL) May 20, 2025
యుధ్వీర్ ఓవర్లో అశ్విన్ వరుసగా 4, 6 బాదగా స్కోర్ 30కి చేరింది. ఐదో బంతిని మాత్రే లాంగాన్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన మాత్రేను దేశ్‌పాండే పెవిలియన్ చేర్చాడు.హ్యాట్రిక్ ఫోర్లు బాది అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగు .. పెద్ద షాట్ ఆడే క్రమంలో మఫాకా చేతికి చిక్కాడు. ఆ సేపటికే రవీంద్ర జడేజా(1), అశ్విన్ (13)లు సైతం పెవిలియన్ చేరారు.
ఆయుష్ మాత్రే(43)
రాజస్థాన్ బౌలర్ల ధాటికి 78కే సగం వికెట్లు కోల్పోయిన చెన్నైని డెవిల్డ్ బ్రెవిస్(42), శివం దూబే(39)లు ఆదుకున్నారు. రాజస్థాన్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ 130 దాటించారు. ఆరో వికెట్‌కు విలువైన 59 పరుగులు జోడించిన వీళ్లను మధ్వాల్ విడదీశాడు. బ్రెవిస్‌ను బౌల్డ్ చేసి సీఎస్కే భారీ స్కోర్ ఆశలకు చెక్ పెట్టాడు. ఆ తర్వాత సిక్సర్లతో అలరించిన దూబే.. చివరి ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. ఐదో బంతికి ధోనీ(16) సైతం వెనుదిరిగాడు. దాంతో, చెన్నై 187 పరుగులకే పరిమితమైంది.
Dewald Brevis departs after a well-played 42 as #RR break an important partnership 👊#CSK six down for 138 after 14 overs.
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR pic.twitter.com/RPxgt1tgYd
— IndianPremierLeague (@IPL) May 20, 2025