Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమవుతున్నాడు. ఐసీసీ ‘అవినీతి నియమావళి'(Anticurruption Code)ని ఉల్లంఘించినందుకు మూడన్నరేళ్ల నిషేధానికి గురైన అతడు.. ఈ ఆగస్టులో పునరాగనం చేయబోతున్నాడు. అది కూడా 39 ఏళ్ల వయసులో. అనుభవజ్ఞుడైన అతడి రీ ఎంట్రీకి జింబాబ్వే క్రికెట్ బోర్డు సైతం పచ్చ జెండా ఊపింది. దాంతో, వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఆడడమే తన లక్ష్యం అంటున్నాడు టేలర్.
‘కోచ్‌గా మారాలనుకున్నా. కానీ, నేను ఇప్పటికీ క్రికెట్ ఆడాలనుకుంటున్నా. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా సత్తా చాటుతాననే నమ్మకం నాకుంది. ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉన్నాను. మళ్లీ ఆడాలనుకుంటున్న నాకు ఎండీ గివ్మోర్ ఎంతో మద్దతుగా నిలిచాడు. ‘కోచింగ్ సంగతి తర్వాత ఆలోచించు. రాబోయే వన్డే వరల్డ్ కప్ మీద దృష్టి పెట్టు’ అని చెప్పాడు. అతడి సలహా నచ్చింది. నాకు అప్పటికీ 41 ఏళ్లు వస్తాయి. అయినా సరే.. దేశం కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నా’ అని టేలర్ వెల్లడించాడు.
After a three-and-a-half year ban, Brendan Taylor could make a comeback to international cricket in August, and he’s ready to give whatever he can for his country 🇿🇼
Full interview by @FirdoseM: https://t.co/58h76Dl4gx pic.twitter.com/zY3kkG6i9Q
— ESPNcricinfo (@ESPNcricinfo) May 20, 2025
వన్డే వరల్డ్ కప్(2011) తర్వాత జింబాబ్వేకు సారథ్యం వహించిన టేలర్.. 2015 వరకూ కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే.. అతడు అనూహ్యంగా 2021లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అందుకు కారణం డ్రగ్స్(Drugs), ఆల్కహాల్‌కు బానిసగా మారిన అతడు రిహాబిలిటేషన్ కేంద్రంలో చేరాడు. అక్కడ టేలర్‌లో మార్పు వచ్చింది. మునపటిలా మారిన అతడు ఇంటివద్దనే కుర్రాళ్లకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ప్రస్తుతం వన్డే, టీ20లకు సారథులగా ఉన్న సియన్ విలియమ్స్(39 ఏళ్లు), సికిందర్ రజా(38 ఏళ్లు) తనకు స్ఫూర్తి అంటున్నాడు టేలర్. దక్షిణాఫ్రికాతో పాటు జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.