IPL 2025 : సగం వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆదుకున్న డెవాల్డ్ బ్రెవిస్(42) బౌల్డయ్యాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడబోగా బంతి ఎడ్జ్ తీసుకొని వికెట్లను గిరాటేసింది. దాంతో, హాఫ్ సెంచరీకి చేరువైన అతడు నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. బ్రెవిస్‌ను ఔట్ చేయడంతో ఆరో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం శివం దూబే(17), ఎంఎస్ ధోనీ(1)లు క్రీజులో ఉన్నారు. వీళ్లిద్దరు చెలరేగి ఆడితే చెన్నై 200 ప్లస్ కొట్టడం ఖాయం. 14 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 138-6.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓకే ఓవర్లో ఓపెనర్ డెవాన్ కాన్వే(10), యువకెరటం ఉర్విల్ పటేల్(0) ఔటయ్యారు. యుధ్వీర్ సింగ్ వేసిన రెండో ఓవర్లో.. కాన్వే చెత్త షాట్ ఆడి పరాగ్‌కు దొరికిపోయాడు. ఆఖరి బంతికి ఉర్విల్ సైతం అదే తరహా షాట్ ఆడగా.. మఫాకా వెనక్కి పరుగెడుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. దాంతో, రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన అశ్విన్(12).. ఓపెనర్ ఆయుష్ మాత్రే(43)కు అండగా చెన్నై నిలిచాడు.
Spectacular skills on display, ft. Kwena Maphaka 😍
Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/dQxjGnkVab
— IndianPremierLeague (@IPL) May 20, 2025
యుధ్వీర్ ఓవర్లో అశ్విన్ వరుసగా 4, 6 బాదగా స్కోర్ 30కి చేరింది. ఐదో బంతిని మాత్రే లాంగాన్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించిన ఈ ద్వయాన్ని దేశ్‌పాండే విడదీశాడు. అర్ధ శతకానికి చేరువైన ఈ చిచ్చరపిడుగు హ్యాట్రిక్ ఫోర్లు బాది.. పెద్ద షాట్ ఆడే క్రమంలో.. మఫాకా చేతికి చిక్కాడు. ఆ సేపటికే రవీంద్ర జడేజా(1), అశ్విన్(13)లు సైతం పెవిలియన్ చేరారు.