నిహాల్, ప్రియాదేశ్పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సందిగ్ధం’. పార్థసారథి కొమ్మోజు దర్శకత్వం వహించారు. తీర్థ క్రియేషన్స్ పతాకంపై సంధ్య తిరువీధుల నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది.
త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. నవతరం ప్రేమకథా చిత్రమిదని, ప్రేమికుల తాలూకు మనోభావాలకు దర్పణంలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నందన్‌కృష్ణ, సంగీతం: గౌతమ్ రవిరామ్, దర్శకత్వం: పార్థసారథి కొమ్మోజు.