Karun Nair | ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. కరుణ్ నాయర్ జట్టులో చోటుదక్కించుకున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులోకి తిరిగివచ్చాడు. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్స్, ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్స్, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లు, ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు, ఐదుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లు, ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు జట్టులో చోటు కల్పించింది.
Read Also : IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు.. ఇండియా-ఏ నుంచే తొమ్మిది మంది సీనియర్ జట్టులో ఛాన్స్..!
టీమిండియాలోకి కరుణ్ నాయర్ పునరాగమం సినిమా స్టోరీలాగే అనిపిస్తోంది. ఇటీవల డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారించిన నాయర్‌కు బీసీసీఐ భారత-ఏ జట్టుతో పాటు సీనియర్ జట్టులో సైతం చోటు కల్పించింది. కరుణ్ పునరాగమనం చూస్తే సినిమా స్టోరీ కంటే తక్కువ కాదు. 2022 సంవత్సరంలో వరుస వైఫల్యాల తర్వాత నాయర్ ఓ భావోద్వేగ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ప్రియమైన్ క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వండి’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం కరుణ్ నాయర్‌కు మరోసారి అవకాశం వచ్చింది. ఈ సారి వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా వాడుకొని టీమిండియాలో స్థానం సుస్థిరం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కరుణ్ నాయర్ 2016లో భారతదేశం తరఫున అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ, చాలాకాలం జట్టు తరఫున ఆడలేకపోయాడు. ఒకసారి జట్టుకు దూరంగా తిరిగి మళ్లీ జట్టులోకి చేరేందుకు చాలా సంవత్సరాలు పట్టింది. 2022లో కర్నాటక జట్టు నుంచి సైతం తప్పించారు. ఆ సమయంలోనే తనకు మరోసారి అవకాశం ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు.
ఇంగ్లాండ్‌లో టీమిండియా సుదీర్ఘంగా టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నది. ఈ సిరీస్‌లో కరుణ్ నాయర్ అద్భుత ప్రదర్శన చేయగలిగితే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని కరుణ్ నాయర్ సద్వినియోగం చేసుకొని అద్భుత ఇన్నింగ్స్ ఆడగలిగితే.. రోహిత్, కోహ్లీ స్థానంలో చోటు సంపాదించేందుకు వీలుంటుంది. చాలా సంవత్సరాలుగా దేశీయ క్రికెట్లో కర్నాటకకు ప్రాతినిధ్యం వహించిన కరుణ్ నాయర్ ప్రస్తుతం విదర్భ తరఫున ఆడుతున్నాడు. 2024-25 విజయ్ హజారే ట్రోఫీలో, అతను ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలతో సహా 779 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు వరుసగా సెంచరీలు చేయడం విశేషం. నాయర్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో విదర్భను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అంతే కాకుండా రంజీ ట్రోఫీలోనూ బ్యాట్ పరుగుల వరద పారించాడు. కేరళతో జరిగిన ఫైనల్లో కీలక సెంచరీ, అర్ధ సెంచరీతో సహా తొమ్మిది మ్యాచుల్లో 863 పరుగులు చేశాడు.
Read Also : BCCI: హర్షత్ రాణా.. సర్ఫరాజ్ ఖాన్ డ్రాప్.. బుమ్రా, షమీపై బీసీసీఐ ఏమన్నదంటే
భారత్ తరఫున కరుణ్ నాయర్ 62 సగటుతో పరుగులు చేశాడు. టీమిండియా తరఫున కేవలం ఆరు టెస్టు మ్యాచుల్ల 62.33 సగటుతో 374 పరుగులు చేశాడు. ఇందులో ట్రిపుల్ సెంచరీ ఉండడం విశేషం. వరుస ఏడు ఇన్నింగ్స్‌లో 4, 13, 303నాటౌట్, 26, 0, 23, 5 పరుగులు చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో కరుణ్ 49.16 సగటుతో 8,211 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమిండియా సీనియర్ జట్టు తరఫున ట్రిపుల్ సెంచరీ చేసినా చాలాకాలం జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురైంది. 2018లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన జట్టులో నాయర్‌కు చోటు దక్కింది. కానీ, ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు.
Read Also : IPL 2025 | రజత్ పాటిదార్‌కు షాక్.. రూ.24లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ పరిపాలన..!
నాయర్ చివరిసారిగా ఫిబ్రవరి 2017లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కనిపించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కరుణ్ నాయర్‌కు చోటు దక్కినా.. తుది జట్టులో చోటు కల్పిస్తే.. ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ భారత్ తరఫున టెస్టు ఆడనున్నాడు. 2016లో కరుణ్ నాయర్ టీమిండియా తరఫున రెండు వన్డే మ్యాచులు ఆడాడు. హరారేలో జింబాబ్వే జట్టుతో రెండు మ్యాచులు ఆడి.. 46 చేశాడు. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియా-ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు మ్యాచులు ఆడనున్నది. మే 30 నుంచి కాంటర్బరీలో తొలి టెస్ట్ ఆడనుండగా.. జూన్ 13 నుంచి బెకెన్‌హామ్‌లో ఇండియా-ఏ సీనియర్ జట్టుతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది.