Shubman Gill | ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. అందరూ ఊహించినట్టే.. టీమిండియా 37వ టెస్ట్ కెప్టెన్ (Test captain)గా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నియమితులయ్యారు. ముంబైలో జరిగిన సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు ప్రకటించింది. ఇక వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌కు ఛాన్స్ ఇచ్చారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు వెళ్లనున్న భారత జట్టు సభ్యుల జాబితాను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో గిల్(కెప్టెన్), పంత్(వైస్ కెప్టెన్), యశశ్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, జడేజా, ధ్రువ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇవాళ సమావేశమైన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్‌తో జరిగే 5 టెస్ట్‌ల సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు.
Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪
A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq
— BCCI (@BCCI) May 24, 2025
Also Read..
Kidambi Srikanth: మలేషియా మాస్టర్స్ ఫైనల్లోకి శ్రీకాంత్
SRH | రైజర్స్ షాన్‌దార్.. ఆర్సీబీపై హైదరాబాద్ అద్భుత విజయం