IND Vs ENG | ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబయిలో విలేకరుల సమావేశంలో ప్రకటించింది. భారత జట్టుకు కెప్టెన్‌గా యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. భారత జట్టు పర్యటకు ముందు ఇంగ్లాండ్ ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు టెస్టులు ఆడనున్నది. ఈ మ్యాచుల కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే ఇండియా-ఏ జట్టుకు ఎంపికైన తొమ్మిది మంది ప్లేయర్స్ సీనియర్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు. ఇందులో శుభ్‌మన్ గిల్‌తో పాటు సాయి సుదర్శన్ సైతం ఉన్నారు.
ఇండియా-ఏ.. ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగే ఈ రెండు మ్యాచులు కాంటర్బరీ, నార్తాంప్టన్‌లో జరుగనున్నాయి. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి మ్యాచ్ మే 30 నుంచి జూన్ 2 వరకు జరుగుతుంది. రెండో మ్యాచ్ జూన్ 6 నుంచి 9 వరకు నార్తాంప్టన్‌లో జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 13 నుంచి 16 వరకు ఇంట్రా స్క్వాడ్ మ్యాచులను టీమిండియా ఆడుతుంది. జూన్ నుంచి భారత్-ఇంగ్లాండ్ సీనియర్ జట్ల మధ్య తొలి టెస్టు మొదలవుతుంది. భారత-ఏ జట్టుతో పాటు సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న తొమ్మిది ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్ ఉన్నారు.
సర్ఫరాజ్ ఖాన్, హర్షిత్ రాణాతో సహా 11 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే, ఇండియా ఏ జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్, హర్షిత్, ఇషాన్ కిషన్, మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రితురాజ్ గైక్వాడ్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే సీనియర్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. సర్ఫరాజ్, హర్షిత్ ఇద్దరు సీనియర్ జట్టులో చోటు లభించకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టులో చోటు కోసం పోటీపడ్డారు. సర్ఫరాజ్, హర్షిత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులో చోటు దక్కింది. తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా-ఏ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్-వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.